4,158 పంచాయతీలకు.. 27,277 నామినేషన్లు

4,158 పంచాయతీలకు.. 27,277 నామినేషన్లు

TG: మూడో విడతలో 4,158 గ్రామ పంచాయతీల్లోని సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 27,277 నామినేషన్లు దాఖలయ్యాయి. 36,442 వార్డులకు 89,603 మంది నామినేషన్లు వేశారు. సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు మొత్తం 1,16,880 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే, రాష్ట్రవ్యాప్తంగా 11 సర్పంచ్ పదవులకు ఎవరూ నామినేషన్‌ వేయలేదు. అత్యధికంగా 6 స్థానాలు నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఉన్నాయి.