నేడు ఉచిత వైద్య శిబిరం ఎక్కడంటే..?
ASR: చింతపల్లి మండలం లంబసింగిలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో రక్తపోటు, మధుమేహం, గుండె, మహిళల్లో గర్భాశయ సమస్యలకు సంబంధించి వైద్యనిపుణులు పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఉంటుందని విజయవాహిని టాటా ట్రస్టు ప్రతినిధి అప్పలరాజు తెలిపారు.