VIDEO: ఎమ్మెల్యే కడియం రాజీనామా చేయాలని రాస్తారోకో

VIDEO: ఎమ్మెల్యే కడియం రాజీనామా చేయాలని రాస్తారోకో

JN: స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య స్వల్పతోపులాట చోటుచేసుకుంది. ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది పోలీసులు ఆందోళన చేస్తున్నవారిని అరెస్టు చేశారు .