హాస్టళ్ల రూపురేఖల మార్పుకు కలెక్టర్ కీలక ఆదేశాలు
KNR: జిల్లాలో సంక్షేమ వసతి గృహాలను సమగ్రంగా అభివృద్ధి చేసి, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా హాస్టళ్ల రూపురేఖలను పూర్తిగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో అధికారులు, సిబ్బందికి కలెక్టర్ కీలక సూచనలు చేశారు.