“బాబు షూరిటీ మోసం గ్యారంటీ” కార్యక్రమం

కృష్ణా: పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం పమిడిముక్కల మండలం మర్రివాడ గ్రామంలో జరిగిన “బాబు షూరిటీ మోసం గ్యారంటీ” కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇచ్చి, గద్దెనెక్కాక ప్రజలను మోసం చేశారని విమర్శించారు.