రూ.390 కోట్లు మంజూరుపై ఎమ్మెల్యే హర్షం

రూ.390 కోట్లు మంజూరుపై ఎమ్మెల్యే హర్షం

ATP: రాయదుర్గం నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.390 కోట్లు మంజూరు కావడంపై ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. దీంతో దశాబ్దాల కాలంగా ఉన్న నీటి కొరత తీరనుందని స్పష్టం చేశారు. ఈ పథకంతో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.