దేవరపల్లి మండల టీడీపీ అధ్యక్షుడికి ఘన సన్మానం
EG: దేవరపల్లి మండల టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికైన తంగెళ్ల మునేశ్వరరావుకు జగ్జీవన్ రామ్ యూత్ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు సుంకర దుర్గారావుతో కలిసి మునేశ్వరరావును శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు కోటి, వెంకటరత్నం, నాజీ, తదితరులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.