VIDEO: ఎట్టకేలకు యువకుడి ఆచూకీ లభ్యం

VIDEO: ఎట్టకేలకు యువకుడి ఆచూకీ లభ్యం

WGL: జిల్లాకు చెందిన అబ్రార్ అనే పర్యాటకుడు ములుగు జిల్లాలోని ముత్యం ధార జలపాతాన్ని సోమవారం సందర్శించాడు. రీల్స్ చేయడానికి అడవి మార్గంలో వెళ్లగా దారి తప్పాడు. భయపడిన అతడు డయల్ 100కు ఫోన్ చేయగా, మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు అటవీ శాఖ అధికారులు గాలింపు చేపట్టి అతడిని రక్షించారు. పర్యాటక చట్టాల ప్రకారం అతని పై పోలీసులు కేసు నమోదు చేశారు.