'సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాలి'

VSP: విశాఖలోని 29వ వార్డు, వెంకటేశ్వరనగర్‌లో 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కార్పొరేటర్, మాజీ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ రికిటి నారాయణరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంపై అవగాహన సదస్సు నిర్వహించారు.