'మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా'
VKB: వికారాబాద్ మున్సిపల్ ఛైర్మన్‌గా ఇవాళ గడ్డం అనన్య ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ శాసన సభాపతి కూతురు అనన్య ఛైర్మన్ కావడంతో మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని తోటి కౌన్సిలర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోవు రోజుల్లో అధిక నిధులు తీసుకువచ్చి మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తామని ఆమె తెలిపారు.