ఇసుక, మొరం తరలిస్తున్నటిప్పర్లు సీజ్
NRPT: ఊట్కూర్ మండలంలో అక్రమంగా మొరం, ఇసుక రవాణా చేస్తున్న రెండు టిప్పర్లను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం, వల్లంపల్లికి చెందిన పరశురాములు అనుమతి లేకుండా మొరం తరలిస్తుండగా పట్టుకున్నారు. అలాగే నరేష్ అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు హెచ్చరించారు.