తాజంగి జలాశయానికి భారీగా వరద నీరు
ASR: చింతపల్లి మండలం తాజంగి జలాశయానికి వరద నీరు భారీగా చేరింది. దీంతో జలాశయం పొర్లు నుంచి దిగువకు ఉద్ధృతంగా నీరు ప్రవహిస్తోంది. మొంథా తుఫాన్ ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో వర్షపు నీరు అధికంగా జలాశయానికి చేరుకుంది. ప్రస్తుతం జలాశయం నిండుకుండలా ఉంది. జలాశయం నుంచి దిగువకు నీరు ప్రవహిస్తుండటంతో బలభద్రం వాగు, పెద్దగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.