VIDEO: పొలంలో చల్లిన గడ్డి మందు తిని ఆవులు మృతి
WGL: రాయపర్తి మండలం సుభాష్ తండాలో ఆదివారం విషాద ఘటన జరిగింది. స్థానిక రైతు పొలంలో చల్లిన గడ్డి మందు గుళికలను తిని మూడు ఆవులు మృతి చెందినట్లు బాధిత రైతు భూక్య యాకూబ్ ఆరోపించాడు. ఆవుల మృతి వల్ల దాదాపు రూ. 2 లక్షల నష్టం ఏర్పడిందని, గడ్డి మందు చల్లిన రైతుపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.