ఆధార్ అప్ డేట్‌లో జిల్లా టాప్

ఆధార్ అప్ డేట్‌లో జిల్లా టాప్

CTR: ఆధార్ అప్ డేట్‌లో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆధార్ నిబంధనల మేరకు 5-7 ఏళ్ల, 15-17 ఏళ్ల మధ్యలో వయసున్న పిల్లల ఆధార్ అప్డేట్ చేయాలి. చిత్తూరు జిల్లాలో 48,948 మంది పిల్లలు ఈ వయసు వారు ఉండగా DEC 13వ నాటికి 30,929 మంది అప్డేట్ చేసుకున్నారు. దీనికోసం జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.మొత్తంగా 63%తో టాప్‌లో జిల్లా నిలిచింది.