పిడుగుపాటుతో పాడి గేద మృతి

AKP: దేవరపల్లి ఏ.కొత్తపల్లి పంచాయతీ కొప్పాక చెరువు కల్లాలు వద్ద సోమవారం పిడుగుపడి పాడి గేద మృత్యువాత పడింది. స్థానికంగా పశుపోషణ చేస్తూ జీవనం సాగిస్తున్న ఈశ్వరమ్మకు చెందిన గేదెను పాక బయట కట్టి ఉంచగా ఆకస్మికంగా పిడుగు పడటంతో అక్కడికక్కడే చనిపోయింది. సుమారు రూ. 80వేల నష్టం వాటిల్లడంతో కుటుంబ పోషణకు గురైంది.