'ఎయిడ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'
SRPT: ఎయిడ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డాక్టర్ నాగరాజు కోరారు. ఇవాళ నాగారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎయిడ్స్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. యువత సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలన్నారు. గ్రామాల్లో యువతకు అవగాహన కల్పించాలన్నారు. యువత లైంగిక వ్యాధులు, ఎయిడ్స్ రక్తదానం పట్ల పూర్తి అవగాహన ఉండాలని పేర్కొన్నారు.