మాజీ ఎమ్మెల్యే ఇలాఖాలో BJP అభ్యర్థి ఘన విజయం
KNR: గంగాధర మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో BJP అభ్యర్థి దూలం కల్యాణ్ 782 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. BRS మాజీ MLA సుంకే రవిశంకర్ స్వగ్రామం కావడం, కాంగ్రెస్ MLA మేడిపల్లి సత్యం స్వయంగా వెళ్లి ప్రచారం నిర్వహించడంతో వార్తల్లో నిలిచింది. ప్రభావశీలమైన నేతలు ఉన్న ప్రాంతంల్లో BJP అభ్యర్థి విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.