'రెవెన్యూ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి'
AKP: ప్రభుత్వ భూములపై కోర్టుల్లో కేసులు వేస్తుండడంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. బుధవారం శాసనసభలో మాట్లాడుతూ.. భూముల కేసుల కోసం నియమించిన లైజనింగ్ అధికారులు కుమ్మక్కవుతున్నారని పేర్కొన్నారు. బాధ్యతాయుతంగా రెవిన్యూ అధికారులు పనిచేయకపోతే భూములు అన్యాక్రాంతం అవుతాయన్నారు.