'విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి'
SKLM: ఎల్ ఎన్ పేట మండలం ఎల్ ఎన్ పేట గ్రామంలో గల కేజీబీవీ పాఠశాలను పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలని పాఠశాల సిబ్బందిని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.