మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా పల్లవి నియామకంపై హర్షం
అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా బల్లా పల్లవి నియామకంపై మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అనంతపురం నగర శివారులోని పీవీకేకే కళాశాల నందు జరుగుతున్న కార్యక్రమానికి పల్లవి హాజరవగా, పల్లె రఘునాథరెడ్డి ఆమెను అభినందించారు. 'వెరీ గుడ్ తల్లి, కష్టానికి తగ్గ ప్రతిఫలం పార్టీ గుర్తిస్తుందని' తెలుపుతూ.. ఆయన పల్లవిని ఆశీర్వదించారు.