VIDEO: 'మెజారిటీ స్థాయిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవం'
HYD: కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులే మెజారిటీ స్థాయిలో ఎన్నికవుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 15 శాతానికి పైగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవమవుతున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు.