మృతులందరినీ గుర్తించాం: రంగారెడ్డి కలెక్టర్
TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతులందరినీ గుర్తించామని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని అన్నారు. మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి చేసి.. కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. గాయపడ్డవారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు.