కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు గమనిక

KDP: కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు డాక్యుమెంట్లు పరిశీలనకు ఈనెల 25, 26 తేదీల్లో జిల్లా పోలీస్ కార్యాలయంలో హాజరుకావాలని కడప SP అశోక్ కుమార్ గురువారం ఒక ప్రకటన తెలిపారు. అభ్యర్థులు సెలక్షన్ సమయంలో జతపరిచిన ఒరిజినల్ డాక్యుమెంట్లను గెజిటెడ్ అధికారితో అటిస్టేషన్ చేయించి 3 సెట్ల జిరాక్స్ కాపీలను 6 పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలను తీసుకురావాలని సూచించారు.