ఇది కూడా దొంగతనం చేస్తారా..?

ఇది కూడా దొంగతనం చేస్తారా..?

NLR: ట్రాన్స్‌ఫార్మర్‌లోని రాగి తీగను చోరీ చేసిన ఘటన నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగళ్లపాళెంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు రాజేష్‌కు 25 కేవీ ట్రాన్స్ ఫార్మర్ ఉంది. ట్రాన్స్‌ఫార్మర్‌ను పొలంలో పెట్టిన నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు అందులోని రాగి తీగను చోరీ చేశారు. రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.