నేడు ఎస్పీతో ఫోన్ ఇన్ కార్యక్రమం

VZM: జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌తో ఫోన్ ఇన్ ఇవాళ కార్యక్రమం జరగనున్నట్లు నిర్వాహుకులు తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతుందని చెప్పారు. జిల్లాలో ఉన్న ప్రజలు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా ఫోన్ నెంబర్9121109483 ద్వారా విన్నవించుకోవాలని పేర్కొన్నారు. ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.