హెరిటేజ్ వాక్ సందర్భంగా పోలీసుల రిహార్సల్స్

హెరిటేజ్ వాక్ సందర్భంగా పోలీసుల రిహార్సల్స్

HYD: ఈనెల 13న చార్మినార్ వద్ద మిస్ వరల్డ్ పోటీదారులు హెరిటేజ్ వాక్ నిర్వహించనున్న నేపథ్యంలో ఆదివారం పోలీసులు రిహార్సల్స్ నిర్వహించారు. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పర్యవేక్షణలో ఆదివారం సాయంత్రం చార్మినార్ నుంచి లాడ్‌బజార్ వరకు హెరిటేజ్ వాక్ రిహార్సల్స్ చేశారు. బస్సుల్లో మిస్ వరల్డ్ పోటీదారులను తీసుకువచ్చి వారికి చార్మినార్ వద్ద స్వాగతం పలకనున్నారు.