'చదువుతోనే అభివృద్ధి సాధ్యం'

'చదువుతోనే అభివృద్ధి సాధ్యం'

MNCL: చదువుతోనే అభివృద్ధి సాధ్యమని సీఆర్పీ రవి సూచించారు. శనివారం జన్నారం మండలంలోని తపాలాపూర్ గ్రామంలో ఓఎస్సీ సర్వేను నిర్వహించారు. చదువుకు దూరంగా ఉన్న టేకం అనిత అనే విద్యార్థిని గుర్తించి సమీప ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. చదువుతోనే అభివృద్ధి సాధ్యమని, చిన్నారులు క్రమం తప్పకుండా పాఠశాలలకు వెళ్లాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.