అక్రమంగా స్కూల్ కూల్చివేత.. ఎంపీ ఫైర్
SRD: పటాన్‌చెరు నడిబొడ్డులో ప్రభుత్వ జిల్లా పరిషత్ స్కూల్ స్థలాన్ని కొంత మంది అక్రమార్కులు కబ్జా చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బుధవారం అర్థరాత్రి కూల్చి వేతలు చేపట్టారు. దీనిపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.