మంత్రి సవితను కలిసిన కూటమి నాయకులు
సత్యసాయి: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు మంత్రి సవితను కలిసి తమ ప్రాంత సమస్యలను వివరించి వినతి పత్రాలు అందజేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునేలా చూస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు.