ఒంటిమిట్ట చెరువులో 108 అడుగుల విగ్రహం

ఒంటిమిట్ట చెరువులో 108 అడుగుల విగ్రహం

KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయానికి అనుబంధంగా రెండు కీలకమైన అభివృద్ధి పనులను చేపట్టాలని TTD ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఒంటిమిట్ట చెరువులో 108 అడుగుల శ్రీరాముని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. మరోవైపు కళ్యాణ వేదికకు ఎదురుగా 100 గదుల భవన సదుపాయం నిర్మాణానికి రూ. 42 కోట్లు కావాలని ఇంజనీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.