ఆరాధన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే, మేయర్

ప్రకాశం: ఒంగోలులోని 15వ డివిజన్ పరిధిలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయంలో మంగళవారం స్వామివారి 354వ ఆరాధన మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఆరాధన మహోత్సవంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దంపతులు, మేయర్ గంగాడ సుజాత సైతం పాల్గొన్నారు. అనంతరం వీరు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.