చివరి రోజు ఎన్నికల ప్రచారం ప్రారంభం

చివరి రోజు ఎన్నికల ప్రచారం ప్రారంభం

MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం చివరి రోజు ప్రారంభమైంది. మంగళవారం జన్నారం మండలంలోని పొన్కల్ గ్రామ రెండో వార్డు అభ్యర్థి యూసుఫ్ తన మద్దతుదారులతో రాంనగర్ కాలనీలో ప్రచారం ప్రారంభించారు. అలాగే పలు గ్రామాలలో కూడా అభ్యర్థులు తమ మద్దతుదారులతో ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది.