VIDEO: అర్జీల తక్షణ పరిష్కారానికి ఆదేశాలు
MLG: గిరివాణి, ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ దివాకర టి.ఎస్ ఆదేశించారు. ఏటూరునాగారం ఐటీడీఏలో జరిగిన కార్యక్రమంలో ప్రజల ఫిర్యాదులు స్వీకరించారు. గిరివాణికి 60, ప్రజావాణికి 32 అర్జీలు అందినట్లు తెలిపారు. పెండింగ్ లేకుండా వెంటనే పరిష్కారం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.