VIDEO: అకాల వర్షాలతో 100ఎకరాలకు పైగా నష్టం

ప్రకాశం: కొమరోలు మండలంలోని తాటిచెర్ల గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు 100 ఎకరాలకు పైగా పొగాకు రైతులకు నష్టం వాటిల్లింది. ఎకరాకు రూ. 70,000 పెట్టుబడి పెట్టామని, తీరా పంట చేతికి వచ్చే సమయానికి మూడు రోజుల నుంచి కురిసిన అకాల వర్షానికి పంట నష్టం వాటిల్లిందని వాపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని పొగాకు రైతులు కోరారు.