అనుమానాస్పదంగా ఇద్దరు మృతి
RR: కొత్తూరు పురపాలక కేంద్రంలో అనుమానాస్పదంగా ఓ యువతి, యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలతో స్థానిక బిస్కెట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇవాళ పని ముగించుకుని ఇంటికి వచ్చేసరికి గదిలో తన కుమార్తెతోపాటు ఓ గుర్తు తెలియని యువకుడి మృతదేహాలను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, వీరి మృతికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.