ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన గ్రామస్తులు
ప్రకాశం: నాగులుప్పలపాడు మండలం నిడుమానూరు జూనియర్ కళాశాలలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వెంకయ్య అనే ఉపాధ్యాయుడికి గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. గత నాలుగు రోజులుగా విద్యార్థినులను ఎక్కడపడితే అక్కడ తాకుతున్నాడని విద్యార్థులు కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో గ్రామస్తులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు.