యూరియా కోసం రైతుల ఇబ్బందులు

WGL: పర్వతగిరి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కొరతతో రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట గురువారం బారులు తీరారు. నాలుగు రోజుల నుంచి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామని, ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు బస్తాలు మాత్రమే ఇవ్వడంతో అవి సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు.