ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి

AP: ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. బ్యారేజీకి 10.92 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. అధికారులు 175 గేట్లను ఎత్తి 10,01,410 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లంక గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. తూ.గో., ప.గో., కాకినాడ, ఏలూరు జిల్లాల్లోని నదీపరివాహక గ్రామాలకు వరద ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి.