'అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు'
MDK: అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కొల్చారం పోలీసులు తెలిపారు. వై జంక్షన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. మెదక్ నుంచి కౌడిపల్లి వైపు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు. అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.