ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
NGKL: తాడూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)ను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఔట్ పేషెంట్ విభాగంలో చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడారు.