పీఎం సూర్య ఘర్ అమలును వేగవంతం చేయాలి: కలెక్టర్

పీఎం సూర్య ఘర్ అమలును వేగవంతం చేయాలి: కలెక్టర్

ప్రకాశం: జిల్లాలో పీఎం సూర్యఘర్ అమలును వేగవంతం చేయాలని, రోజువారిగా పురోగతి సాధించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. శనివారం అధికారులతో సమావేశమై జిల్లాలో పీఎం సూర్య ఘర్ పథకం అమలు పురోగతిపై సమీక్షించారు. జిల్లాలో పీఎం సూర్య ఘర్ పథకం ఇప్పటివరకు 78,766 దరఖాస్తులు రాగా, అందులో 1115 గ్రౌండింగ్ చేయగా, 736 మందికి సబ్సిడీ జమ చేసినట్లు పేర్కొన్నారు.