మరికొద్దిసేపట్లో తాళి కడతాడనుకునే లోపే.. ప్రియుడు ప్రత్యక్షం

మరికొద్దిసేపట్లో తాళి కడతాడనుకునే లోపే.. ప్రియుడు ప్రత్యక్షం

NTR: కాసేపట్లో వరుడు తాళి కడతాడనుకునేలోపు వధువు ప్రియుడు షాకిచ్చాడు. మైలవరం నియోజకవర్గంలో శుక్రవారం రాత్రి వరుడి ఇంటి వద్ద పెళ్లి జరుగుతోంది. పెళ్లి జరుగుతుండగా మధ్యలో ప్రియుడు ప్రత్యక్షమయ్యేసరికి అందరూ నిర్ఘాంతపోయారు. ఆ వెంటనే వధువు ప్రియుడి పక్కన చేరి తాము ప్రేమించుకుంటున్నామని తెగేసి చెప్పడంతో వరుడి కుటుంబం షాక్‌కు గురైంది. దీంతో పెళ్లి ఆగిపోయి ఘర్షణ చోటుచేసుకుంది.