'దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి'
NLG: కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని CITU మండల కన్వీనర్ సత్యనారాయణ పిలుపునిచ్చారు. నేడు రాములబండలో కార్మికులను కలిసి కరపత్రాలను పంపిణీ చేశారు. కార్మికుల హక్కుల రక్షణ కోసం జరుగుతున్న ఈ సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.