ఈనెల 13న జాబ్ మేళా

JN: జనగామ జిల్లా ఉపాధి కల్పన విభాగం ఆధ్వర్యంలో ఈనెల 13న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిని పి.సాహితీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. V2C స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలో ట్రైనింగ్‌తో కూడిన ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం సీనియర్ అసిస్టెంట్ జె.గీత 7995430401 నంబర్‌ను సంప్రదించాలన్నారు.