పల్నాడులో తీవ్ర ఉత్కంఠ

పల్నాడులో తీవ్ర ఉత్కంఠ

GNTR: పిన్నెల్లి సోదరుల లొంగుబాటు, మాచవరం ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో గురువారం పల్నాడులో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పిన్నెల్లికి సంఘీభావం తెలపాలని వైసీపీ పిలుపునిచ్చింది. అయితే గురజాల సబ్‌డివిజన్ పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏం జరుగుతుందోనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.