శ్రీశైలం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు

నంద్యాల: ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో అధికారులు మూడు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 6, 7, 8 గేట్లను ఎత్తడంతో 81 వేల క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్‌కు విడుదలైంది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కడాన్ని వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.