కార్మికులకు సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
GNTR: తెనాలి పట్టణంలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. టీడీపీ నాయకుడు సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో మార్కెట్ వద్ద కార్యక్రమంలో శనివారం ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, కత్తెర సురేష్ కుమార్ పాల్గొన్నారు. కార్మికులకు సరుకులు పంపిణీ చేసి సుద్ధపల్లి నాగరాజును అభినందించారు.