CMRF చెక్కులు పంపిణీ చేసిన MLA వరద
KDP: ప్రొద్దుటూరులో సోమవారం స్థానిక MLA వరదరాజులరెడ్డి 59 మంది లబ్ధిదారులకు రూ.53 లక్షల CMRF చెక్కులు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. 25వ విడత CMRF చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రొద్దుటూరు నియోజక వర్గంలో వైద్య చికిత్సలు చేయించుకున్న బాధితులకు ప్రభుత్వం నుంచి అత్యధిక మొత్తంలో సహాయం చేశామని వివరించారు.