VIDEO: గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు
MHBD: కొత్తగూడ మండలంలోని పలు గ్రామాలలో అక్రమంగా కొనసాగుతున్న గుడుంబా తయారీ కేంద్రాలపై బుధవారం రాత్రి పోలీసులు ఆకస్మికంగా దాడులను నిర్వహించారు. ఎస్సై రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులను నిర్వహించి దాదాపు 400 లీటర్ల గుడుంబాను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గుడుంబా తయారుచేసిన బెల్లం పానకాన్ని నిల్వ ఉంచిన కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.