13 నుంచి జాతీయ పికిల్‌బాల్

13 నుంచి జాతీయ పికిల్‌బాల్

దక్షిణ భారత రాష్ట్రాల్లో తొలిసారిగా జాతీయ పికిల్‌బాల్ పోటీలకు వేదిక సిద్ధమైంది. బెంగళూరులోని స్పోర్ట్స్ స్కూల్‌లో ఈనెల 13 నుంచి నిర్వహించే ఈ పోటీల్లో 20 రాష్ట్రాలకు చెందిన 1400 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. తెలంగాణ నుంచి 55 మంది పోటీపడనున్నారు. విజేతలకు రూ.12 లక్షల నగదు బహుమతి అందజేస్తామని కర్ణాటక పికిల్‌బాల్ సమాఖ్య అధ్యక్షులు శ్రీహర్ష వెల్లడించారు.